చౌటుప్పల్, ప్రజా జాగృతి : చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఉన్న స్థానిక ఆధ్యాత్మిక కేంద్రమైన పుణ్య లింగేశ్వర స్వామి క్షేత్రాన్ని తక్షణమే ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలని భక్తులు మరియు స్థానికులు కోరుతున్నారు. 12 జ్యోతిర్లింగాల విశిష్టతతో విరాజిల్లుతున్న ఈ ఆలయం, ప్రస్తుతం రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల తాకిడితో ఆధ్యాత్మిక వైభవానికి నిలయంగా మారింది. దేశంలోని 12 ప్రధాన జ్యోతిర్లింగాల నమూనాలను ఒకే చోట అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దడం ఈ ఆలయ ప్రత్యేకత. అమ్మానాన్న అనాధ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాధల కోసం నిర్మించినప్పటికీ దూరప్రాంతాల నుండి సైతం వందలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం తరలివస్తున్నారు. ముఖ్యంగా పర్వదినాల్లో ఈ క్షేత్రం భక్తజనసందోహంతో కిక్కిరిసిపోతోంది. ఆలయానికి భక్తుల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు, కానుకలు అందుతున్నాయని, ఆదాయం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆలయ నిర్వహణలో మరింత పారదర్శకత ఉండాలని చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. "విరాళాల రూపంలో వస్తున్న నిధులు ఆలయ అభివృద్ధికి, భక్తుల వసతుల కల్పనకు సక్రమంగా వినియోగించబడాలంటే ప్రభుత్వ పర్యవేక్షణ అత్యవసరం" అని కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల విప్లవ కుమార్ గౌడ్ పేర్కొంటున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *