నలుగురు అరెస్ట్

చౌటుప్పల్, ప్రజాజాగృతి, మే 02 : చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. వలిగొండ రోడ్డులోని హెచ్‌ఎండీఏ వెంచర్‌లో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో శుక్రవారం రాత్రి చౌటుప్పల్ సిఐ మన్మద్ కుమార్ కు అందిన నమ్మదగిన సమాచారం మేరకు, సబ్ ఇన్స్‌పెక్టర్ బి. అజయ్ భార్గవ్ తన సిబ్బందితో కలిసి వలిగొండ రోడ్డులోని సురేష్ అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. రాత్రి 9:30 గంటల సమయంలో పేకాట ఆడుతూ నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన వారిలో లింగారెడ్డిగూడెంకు చెందిన ఎలక్ట్రీషియన్ బొద్దుల శ్యామ్ (31), కాటమయ్య కాలనీకి (తాళ్లసింగారం) చెందిన సుక్క నర్సింహ (42), కేపీఆర్ నగర్‌కు చెందిన వ్యాపారి ఉస్కగుల సురేష్ (36), రాంనగర్ కు చెందిన నందగిరి నరేష్ (35) ఉన్నారు. నిందితుల నుండి పోలీసులు రూ. 51,200 నగదు, 4 సెల్ ఫోన్లు, రెండు సెట్ల పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ ఇన్స్‌పెక్టర్ జి. మన్మధ కుమార్ వెల్లడించారు. పట్టణంలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *