చౌటుప్పల్, ప్రజా జాగృతి, ఏప్రిల్ 02 : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి గ్రామ రైతు వేదికలో గురువారం ’99 రోజుల ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రత్యేక గ్రామసభను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బోయ కాకి శ్రీలత సుందరయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో గ్రామ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీలత మాట్లాడుతూ, గ్రామస్థులందరికీ ప్రభుత్వ ఫలాలు అందాలన్నదే ఈ సభ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు మరియు మంజూరు ప్రక్రియపై చర్చించారు. గ్రామంలో పెన్షన్లకు అర్హత ఉండి, ఇంకా రాని వారి వివరాలను సేకరించి త్వరితగతిన అందేలా చూడాలని నిర్ణయించారు. రైతులకు అవసరమైన ఎరువుల నిల్వలు, పంపిణీ మరియు రైతు భరోసా నిధుల విడుదలపై వ్యవసాయ అధికారులతో సమీక్షించారు. మహిళా సంఘాలకు రావాల్సిన లోన్ల మంజూరు, పొదుపు సంఘాల బలోపేతంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు, హార్టికల్చర్ ఆఫీసర్ కవిత, మహిళా సంఘాల ఏపీఎం, గ్రామ కార్యదర్శి శ్రీకాంత్ పాల్గొన్నారు. ఆయా శాఖల ద్వారా అందుతున్న పథకాలను ప్రజలకు వివరించారు.ఈ గ్రామసభలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, వివిధ శాఖల ప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *