• జెండా ఊపి ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్
  • జై హనుమాన్ నినాదాలతో మారుమోగిన పురవీధులు

చౌటుప్పల్, ప్రజా జాగృతి, ఏప్రిల్ 2 : చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో మిన్నంటాయి. మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో గల పెరుమాండ్ల ఆంజనేయస్వామి దేవస్థానం నుండి శనివారం హనుమాన్ శోభాయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా భక్తులు హనుమాన్ ధ్వజాలతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. “జై శ్రీరామ్.. జై హనుమాన్” అంటూ భక్తులు చేసిన నినాదాలతో పట్టణ పురవీధులు మారుమోగాయి. భక్తుల ఆటపాటలు, భజనల మధ్య శోభాయాత్ర కోలాహలంగా సాగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్ దేప రమ్య రాజు, మార్కెట్ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు దండే అరుణ్ కుమార్, బొడిగె బాలకృష్ణ, పోలోజు శ్రీధర్ బాబు పాల్గొన్నారు. వీరితో పాటు దేవాలయ కమిటీ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ విభాగాల నాయకులు మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *