చౌటుప్పల్, ప్రజా జాగృతి : చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎన్నికల అధికారులు చెన్నూరి రాధా కిషన్ రావు, కానుగుల వెంకటయ్యల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాల్యం వెంకటాచలం నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. బారసోసియేషన్ అధ్యక్షుడిగా తాడూరు పరమేష్,ప్రధాన కార్యదర్శిగా పడమటి మహిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా పిట్టల బిక్షమయ్య,సహాయ కార్యదర్శిగా మక్తాల నరసింహ,లైబ్రరీ సెక్రటరీగా నర్రి స్వామి, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ దేశగోని శ్రీశైలం,మహిళా ప్రతినిధిగా నకరికంటి జ్యోతి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఎండి. ఖయ్యూం పాషా, పిల్లలమర్రి కిరణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఉడుగు శ్రీనివాస్, ఎలమొని శ్రీనివాస్, రాపోలు వేణు, ముత్యాల సత్తిరెడ్డి, తడక మోహన్, జెల్ల రమేష్, బడుగు శ్రీకాంత్, జక్కర్తి శేఖర్, దాచేపల్లి చంద్రబాబు, బొంగు గోపాల్, రిక్కల సుధాకర్ రెడ్డి, కట్టెల లింగస్వామి, అవ్వారు చేతన్, పాల పరమేష్, మల్లికార్జున్, భరత్ కుమార్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *